Pant-Digwesh: లక్నోకు షాక్..కెప్టెన్ పంత్, స్పిన్నర్ దిగ్వేశ్‌కు ఫైన్ 3 d ago

MI, LSG మ్యాచ్‌లో స్లో ఓవర్ రేట్ కారణంగా లక్నో కెప్టెన్ రిషభ్ పంత్, యువ స్పిన్నర్ దిగ్వేశ్ రాఠీకి ఫైన్ పడింది. పంత్‌కు రూ.12లక్షల జరిమానా విధిస్తూ ఐపీఎల్ ఐడ్వైజరీ కమిటీ నిర్ణయం తీసుకుంది. ఈ సీజన్‌లో జరిమాన ఎదుర్కొన్నమూడో సారథిగా అతను నిలిచాడు. ఇంతకుముందు కెప్టెన్లు హార్దిక్ పాండ్యా, రియాన్ పరాగ్ కూడా జరిమానాకు గురయ్యారు. అలాగే యువ స్పిన్నర్ దిగ్వేశ్ రాఠీకి వరుసగా రెండోసారి ఫైన్ వేశారు. అటల్ బిహారీ వాజ్‌పేయి ఎకానా క్రికెట్ స్టేడియం లో జరిగిన ఈ మ్యాచ్‌లో ముంబైపై లక్నో విజయం సాధించింది.